కాలం

కాలం నా డైరీలొని కాగితాలు కావు
కాలం నా హృదయంలో నిలిచిపోయే భావాలూ
కాలం నాలో జ్ఞానం పెంచే అనుభవాలు
కాలం నా పెదువులపై మెరిసే చిరునవ్వులు
కాలం నా కంటి నుండి జారే చిరు చినుకులు
కాలం నా చుట్టూ మనషుల ప్రేమ ద్వేషాలు
కాలం పెరిగే నా వయసు
కాలం కరిగే జీవితం

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

కొత్త సంవత్సరం

కలలన్నవి నా కనులకు లేవు
కానీ ఆశలు నా ఆలోచనలకు ఉన్నాఈ
అందకే నేనెప్పుడు ఆలోచనల అలలపై ఆశల నావ ఫై పయనిస్తూ ఉంటాను
నా గమ్యం నేనే ఐనప్పుడు నా పయనం నాలోకే ఐనప్పుడు
నా ఆశలు నా ఆలోచనలు నన్ను ధాటి పోనప్పుడు
నేను నా కోసం అన్వేషిస్తుంటాను
నేను అనుకొనే నా లోకి నేను సమాజం నిర్మించిన కాలపు హద్దులు దాటుకొని
కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలోతో కొత్త ఆలోచనలతో
కొత్త నా కోసం అన్వేషణలో నా లోకి నేను పయనిస్తూ. . . . . . .

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

నిజమేనా

నింగిలోని తారలు నా కోసం దిగి రావడం నిజమేనా
ఆమె చిరునవ్వుల వెలుగులో నే  నిలబడటం నిజమేనా
ఆమె పలుకుల పల్లకిలో నే విహరించడం  నిజమేనా
ఆమె చూపుల పూలభానాలు నను తోలిచేయడం నిజమేనా
ఆమె శ్వాస పరిమళంలో నే పరవసించడం నిజమేనా
నిజమేనా నిజమేనా నింగి వీడి ఆ తార నాకోసం రావడం నిజమేనా

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS