కాలం నా డైరీలొని కాగితాలు కావు
కాలం నా హృదయంలో నిలిచిపోయే భావాలూ
కాలం నాలో జ్ఞానం పెంచే అనుభవాలు
కాలం నా పెదువులపై మెరిసే చిరునవ్వులు
కాలం నా కంటి నుండి జారే చిరు చినుకులు
కాలం నా చుట్టూ మనషుల ప్రేమ ద్వేషాలు
కాలం పెరిగే నా వయసు
కాలం కరిగే జీవితం
కాలం
కొత్త సంవత్సరం
కలలన్నవి నా కనులకు లేవు
కానీ ఆశలు నా ఆలోచనలకు ఉన్నాఈ
అందకే నేనెప్పుడు ఆలోచనల అలలపై ఆశల నావ ఫై పయనిస్తూ ఉంటాను
నా గమ్యం నేనే ఐనప్పుడు నా పయనం నాలోకే ఐనప్పుడు
నా ఆశలు నా ఆలోచనలు నన్ను ధాటి పోనప్పుడు
నేను నా కోసం అన్వేషిస్తుంటాను
నేను అనుకొనే నా లోకి నేను సమాజం నిర్మించిన కాలపు హద్దులు దాటుకొని
కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలోతో కొత్త ఆలోచనలతో
కొత్త నా కోసం అన్వేషణలో నా లోకి నేను పయనిస్తూ. . . . . . .
నిజమేనా
నింగిలోని తారలు నా కోసం దిగి రావడం నిజమేనా
ఆమె చిరునవ్వుల వెలుగులో నే నిలబడటం నిజమేనా
ఆమె పలుకుల పల్లకిలో నే విహరించడం నిజమేనా
ఆమె చూపుల పూలభానాలు నను తోలిచేయడం నిజమేనా
ఆమె శ్వాస పరిమళంలో నే పరవసించడం నిజమేనా
నిజమేనా నిజమేనా నింగి వీడి ఆ తార నాకోసం రావడం నిజమేనా
కొందరు
మనసున్న మనుషులు కొందరు
మనస్సు చచ్చిన మనుషులు కొందరు
చచ్చి బ్రతికే వాళ్ళు కొందరు
బ్రతికి చచ్చే వాళ్ళు కొందరు
చావలేక బ్రతికే వాళ్ళు కొందరు
బ్రతకలేక చచ్చే వాళ్ళు కొందరు
బ్రతకడం కోసం బ్రతికే వాళ్ళు కొందరు
బ్రతికిన్చెందుకు బ్రతికే వాళ్ళు కొందరు
ఆశయాల వెంట కొందరు
ఆసల వెంట కొందరు
అవకాశవాదులు కొందరు
ఆకాశానికి ఎదగాలని కొందరు
కొందరి నడుమ కొందరు అందరు
అందరి నడుమ కొందరు కొందరు
ఏదైనా చేసేద్దమా
కరిగి పోయే కాలానికి కళ్ళెం వేద్దామా
పరుగులెత్తే పరువాలికి పగ్గం వేద్దామా
ఎగసిపడే ఆసల అంతు చూద్దామా
వయసు పాడే వలపు గీతానికి వంత పాడధామా
మనసు పాడే మావన గీతానికి మాటలిడ్డామా
కళ్ళు కనే కలలకి రుపమిద్దమా
హృదయం లోని బావలను అక్షరాలుగా మార్చేద్దామా
నా కవిత బతుకు బాట
బతుకు గతుకుల బాటలా సాగుతుంది
బతుకు గతుకుల బాటలా సాగుతుంది
బాటలోని మలుపులు మరపురాని తలపులై మనసున నిలిచి పోతుంటే
బతుకు గతుకుల బాటలా సాగుతుంది
బాటలోని గతుకులు మానని గాయలై మనసున నిలిచి పోతుంటే
బతుకు గతుకుల బాటలా సాగుతుంది
బతుకు గతమై బాటలా వెనక్కి సాగుతుంటే
నేను బతుకు బాటపై ముందుకు సాగుతున్నా





